వాట్సాప్ వినియోగదారులకు షాక్......

 


కొత్త సంవత్సరంలో కొందరికి ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కొన్ని ఫోన్లలో ఇక మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ పనిచేయదు. ప్రతి ఏటా పాత ఓఎస్​ వెర్షన్ మొబైళ్లకు సేవలు నిలిపివేస్తున్నట్లుగానే.. ఈ సారి కూడా ఆ దిశగా వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి మిలియన్ల కొద్దీ పాత ఫోన్లకు సేవలు ఆగిపోనున్నాయి. అంతే కాదు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా వాట్సప్ పనిచేయదు. ఒక వేళ మీఫోన్లు యాపిల్​, ఆండ్రాయిడ్​ ఓఎస్​ అప్​డేట్​కు సపోర్ట్​ చేయకపోతే వీలైనంత త్వరగా వాట్సాప్ డేటాను రికవరీ చేసుకోవడం మంచిది. వాట్సప్ పనిచేయని మొబైళ్ల ఇవే.. ఐఓఎస్ 9 (IOS-9)​ కన్నా.. పాత వెర్షన్ ఐఫోన్​ వాడుతున్న వారికి కొత్త ఏడాది నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. అంటే ఐఫోన్​ 4లో ఇకపై వాట్సాప్ నిలిచిపోతుంది. ఐఫోన్​ 4ఎస్, 5, 5ఎస్​, 5సీ, 6, 6ఎస్​ (iPhone 4S, 5, 5S, 5C, 6 and 6S)​ వంటి ఫోన్లను ఐఓఎస్​ 9కి అప్​డేట్ చేసుకుంటే వాట్సాప్ వాడుకునేందుకు వీలుంది. ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్​ కన్నా పాత వెర్షన్​తో నడుస్తున్న వాటికి జనవరి 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. మీ ఫోన్​ ఆండ్రాయిడ్​ 4.0.3, అంతకన్నా కొత్త వెర్షన్​కు అప్​గ్రేడ్​ అయితే అందులో వాట్సాప్ వాడుకునేందుకు వీలుంది