ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం.

 


India vs Australia 2020 : టీమిండియా అద్భుతమైన పోరాటం ఫలించింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు అద్భుత‌ ప్రదర్శన చేసింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 2-0తో కైవసం చేసుకున్నది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కేవలం 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. 3ఫోర్లు, 2సిక్సర్లతో వీరవిహారం చేయడంతో టీమిండియా 2 బంతులు మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదించింది.