సంక్రాంతి బరిలో థియేటర్లలో సందడి చేయనున్న నాలుగు సినిమాలు.

 


2020 సంవత్సరం కరోనా ప్రభావంతో ఎలాంటి సందడి వాతావరణం లేకుండా ముగిస్తోంది. థియెటర్లు మూతపడడంతో అటు సినీ కార్మికులు రోడ్డున పడగా.. సినీ ప్రియులకు నిరాశను మిగిల్చింది. ఈ సంవత్సరం షూటింగ్‏లు కూడా ఆగిపోగా.. ఇటీవల కొన్ని సినిమాల చిత్రీకరణను పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటుండగా.. ఇటీవల థియేటర్లలో రిలీజైన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా దర్శకనిర్మాతలకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. దీంతో వచ్చే సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదల చేసెందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమాను తెలుగులోకి కూడా డబ్ చేసి ఈ ఏడాదిలోనే చేస్తున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తుండగా.. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది కూడా. ఇక తెలుగులో రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఇందులో రామ్ డ్యూయల్ రోల్‏లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‏కు మంచి స్పంధన వచ్చింది. చాలా కాలం తర్వాత రామ్ నటించిన రెడ్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్ సినిమాను కూడా సంక్రాంతి కానుగా విడుదల చేసే అవకాశం ఉంది. కందిరీగ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. జనవరి 15న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రాక్ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర యూనిట్ తెలిపింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. ఇప్పటివరకు మూవీ విడుదలపై ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి క్రాక్ విడుదలయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. 2021 సంక్రాంతికి ఈ నాలుగు సినిమాలు రానుండగా.. ఇన్ని రోజులు వినోదాన్ని మిస్ అయిన ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ఇందులో ఎ సినిమా సంక్రాతి విజేతగా నిలుస్తుందో చూడాలి.