సౌదీ అరేబియా కీలక నిర్ణయం.

 


స్ట్రెయిన్ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వివిధ దేశాల నుంచి వచ్చే విమాన రాకపోకలను రద్దు చేస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియా కూడా ఇదే జాబితాలో చేరింది. అంతర్జాతీయ విమానలపై కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి అంతర్జాతీయ విమానాలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని మరో వారంపాటు పొడిగించింది. ఈ మేరకు సౌదీ అరేబియా ఓ ప్రకటన విడుదల చేసింది. భూ, జల మార్గాలను కూడా మరో ఏడు రోజులపాటు మూసివేస్తున్నట్టు తెలిపింది. కాగా..కొత్త రకం కరోనా వైరస్ మొదటగా బ్రిటన్‌లో బయటపడటంతో సౌదీ అరేబియా ప్రభుత్వం గత వారం రోజులపాటు దేశ సరిహద్దులను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందడంతో ఆ గడువును మరోవారం రోజులపాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ… స్ట్రెయిన్ వైరస్ కేసులు అక్కడ బయటపడలేదు. ఇక జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు 3.62లక్షల మంది కొవిడ్-19 బారినపడ్డారు. ఇందులో 6వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.