బీటెక్ విద్యార్థులకు గూగుల్ గుడ్ న్యూస్.

 


బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ శుభవార్త అందించింది. ప్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్ సమ్మర్ 2021 కార్యక్రమానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులు. నిర్దేశిత ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాల పాటు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తుకు చివరితేది డిసెంబర్ 11, 2020 అని గూగుల్‌ ప్రకటించింది. హైదరాబాద్, బెంగుళూర్‌లోని గూగుల్ క్యాంపస్‌లలో మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది.