ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.

 


డిజిట‌ల్ చెల్లింపు విష‌యంలో ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ ప‌రిస్థితుల్లో మ‌రింత సుర‌క్షిత‌మైన డిజిట‌ల్ లావాదేవీల‌ను అందించ‌డంలో భాగంగా కాంటాక్ట్ లెస్ కార్డులు, ఈ-మాండేట్‌ల ప‌రిమితి పెంచుతూ ఆర్బీఐ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఇప్పుడు రూ.2వేల వ‌ర‌కు చెల్లింపులు లావాదేవీల‌ను పిన్ నంబ‌ర్ లేకుండా జ‌రుపుకొనే అవ‌కాశం ఉండేది. ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితిని రూ.5వేల వ‌ర‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ వెసులుబాటు 2020, జ‌న‌వరి 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ తెలిపారు. ప్ర‌స్తుతం టెక్నాల‌జీ పెరుగుతున్న త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రు డిజిట‌ల్ చెల్లింపుల‌కే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కాంటాక్ట్ లెస్ లావాదేవీలు, ఈ-మాండేట్‌లు క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని ఆర్బీఐ తెలిపింది. అలాగే డిజిట‌ల్ పేమెంట్ల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా ఇప్ప‌టికే నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్ లావాదేవీల‌పై ఛార్జీల‌ను సైతం ఎత్తివేసింది. ఆర్టీజీఎస్ సేవ‌ల‌ను కూడా ప్ర‌తి రోజు 24×7 పాటు అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది.