కొనసాగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్

 


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. చాలా చోట్ల పోలింగ్ బూత్ లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంఐఎం అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. పాతబస్తీలోని శాస్త్రీపురం పోలింగ్ బూత్‌లో ఆయన ఓటువేశారు. అయితే ఓటు వేసేందుకు ఒవైసీ బుల్లెట్ పైన రావడం ఆసక్తికరంగా మారింది. అసదుద్దీన్ అప్పుడప్పుడు ఇలా బుల్లెట్ పై కనిపిస్తుంటారు. గతంలో కేసీఆర్ ను కలిసేందుకు కూడా ఒవైసీ బుల్లెట్ పై ప్రగతీ భవన్ కు వెళ్లారు. ఇక ప్రజలంతా పోలింగ్ శాతాన్ని పెంచాలని, హైదరాబాద్ అభివృధ్ధికోసం ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 150 డివిజన్లకు ఓటింగ్ జరుగుతుండగా అందులో ఎంఐఎం 51 చోట్ల పోటీ చేస్తోంది.