అల్ప ఖనిజాల తవ్వకాలకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు..

 


అల్ప ఖనిజాల తవ్వకాలకు సంబంధించి ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రానైట్ సహా 31 అల్ప ఖనిజ తవ్వకాలకు అనుమతులిచ్చింది. ఈ క్రమంలో ఏపీ మైనర్ మినరల్ రూల్స్‌కు సవరణలు చేస్తూ గవర్నమెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కనీస వార్షిక ఉత్పత్తి సాధించేందుకు వీలుగా ఈ సవరణలు చేసినట్లు పేర్కొంది. 2020- 21కి గానూ అనుమతించిన వార్షిక మైనింగ్ ప్రణాళికను అమలు చేసే విధంగా మార్పులు చేసింది. ఖజానాకు ఎటువంటి నష్టం రాకుండా ఈ సవరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కనీసం 60 శాతం ఉత్పత్తిని సాధించాలని నోటిఫికేషన్​లో గనుల శాఖ పేర్కొంది. సీనరేజి ఫీజు కింద వచ్చే ఆదాయం కోల్పోకుండా చూడాలని అధికారులకు సూచించింది. కనీస ఉత్పత్తి లేకపోతే లీజును రద్దు చేసేందుకు అధికారులకు పవర్ ఇస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి.