రైల్వే జాబ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

 


రైల్వే జాబ్స్ కోసం దరఖాస్తు చేసినవారికి గుడ్ న్యూస్. ముందే ప్రకటించినట్టుగా డిసెంబర్ 15 నుంచే పరీక్షల్ని నిర్వహిస్తోంది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB. మూడు నోటిఫికేషన్లకు ఆర్ఆర్‌బీ కంప్యూటర్ బేస్ట్ టెస్ట్-CBT నిర్వహించాల్సి ఉంది. మొదట ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ కేటగిరీస్ నోటిఫికేషన్‌కు పరీక్షల్ని నిర్వహిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,663 స్టేనో, టీచర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆర్ఆర్‌బీ. ఈ పోస్టులకు 1.03 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేయడం విశేషం. ఈ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2020 డిసెంబర్ 15 నుంచి 18 వరకు జరగనుంది. ఎగ్జామ్స్ రెండు షిఫ్ట్స్‌లో జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 10.30 గంటల నుంచి 90 నిమిషాలు ఉంటుంది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 90 నిమిషాల పాటు ఉంటుంది. అభ్యర్థులు గంటన్నర ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఈ పరీక్షలకు సంబంధించిన డీటెయిల్డ్ షెడ్యూల్‌ను ఆర్ఆర్‌బీ అధికారికంగా ప్రకటించింది. ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లలో ఈ షెడ్యూల్ చూడొచ్చు. డీటెయిల్ షెడ్యూల్ గురించి తెలుసుకోండి.  ఇదే 2020 డిసెంబర్ 15 షిఫ్ట్ 1- జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ 2020 డిసెంబర్ 15 షిఫ్ట్ 2- జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ 2020 డిసెంబర్ 16 షిఫ్ట్ 1- స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్2020 డిసెంబర్ 16 షిఫ్ట్ 2- హెడ్ కుక్, కుక్, ఫోటోగ్రాఫర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ 2020 డిసెంబర్ 17 షిఫ్ట్ 1- జూనియర్ ట్రాన్స్‌లేటర్, ల్యాబరేటరీ అసిస్టెంట్ 2020 డిసెంబర్ 17 షిఫ్ట్ 2- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, కెమిస్ట్, మెటాల్లర్జిస్ట్, ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ మిస్ట్రెస్, మ్యూజిక్ మిస్ట్రెస్, డ్యాన్స్ మిస్ట్రెస్. 2020 డిసెంబర్ 18 షిఫ్ట్ 1- పీజీటీ, టీజీటీ ఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన ఎగ్జామ్ సిటీ, డేట్, షిఫ్ట్ ఇంటిమేషన్, మాక్ టెస్ట్ లాంటి లింక్స్ ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లలో యాక్టివేట్ అయ్యాయి. అభ్యర్థులు ఆయా వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు. ఇక ఆర్ఆర్‌బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్-NTPC, గ్రూప్ డీ నోటిఫికేషన్లకు కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఎన్‌టీపీసీ పోస్టులకు 2020 డిసెంబర్ 28 నుంచి 2021 మార్చి చివరి వారం వరకు, గ్రూప్ డీ పోస్టులకు 2021 ఏప్రిల్ నుంచి 2021 జూన్ మధ్య కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా 1,40,640 పోస్టులకు 2.44 కోట్ల మంది అభ్యర్థులు అప్లై చేయడం విశేషం.