బిజెపి లో...?కి చేరనున్న విజయశాంతి

 


కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది..? ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచార మేరకు విజయశాంతి డిసెంబర్ 7న బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయపు కండువా వేసుకోబోతున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలన్నీ విజయశాంతి బీజేపీలో చేరనున్నారనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షడు బండి సంజయ్ విజయశాంతి మంచి నాయకురాలని కొనియాడారు. అంతకు ముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో రాములమ్మ సమావేశమయ్యారు. విజయశాంతి సైతం జీహెచ్ఎంసీ పోలింగ్ రోజున కాషాయపు మాస్క్‌తో దర్శనమిచ్చారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుండడంతో కొందరు కాంగ్రెస్ నేతలు కమలం పార్టీ వైపు చూస్తున్నారు.