అమెజాన్ అధినేత మాజీ భార్య భారీగా విరాళం.

 


అమెజాన్ అధినేత జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో 18వ ర్యాంకులో ఉన్న మెకంజీ గత 4 నెలలో పేద ప్రజల కోసం ఏకంగా 4 బిలియన్ల డాలర్లు అంటే దాదాపు రూ.29,400 కోట్లు దానం చేశారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు దాదాపు 384 స్వచ్చంద సంస్థలకు ఈ నిధులను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. “ఈ మహామ్మారి కరోనా వైరస్ అమెరికన్ల జీవితాలను నాశానం చేసింది. ఈ వైరస్ వలన ధనవంతులకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. పేద, మధ్య తరగతి ప్రజలలో కరోనా ఆర్థికంగా నష్టాలను కలిగించింది. ఇదే సమయంలో బిలియనీర్లు మాత్రం ఆర్థికంగా చాలా ఎదిరిగిపోయారు” అంటూ మెకంజీ తన ఇన్‏స్టాలో సుదీర్ఘమైన పోస్టు చేసింది