హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.

 


నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2021-22 విద్యా సంవత్సరానికి సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఖాళీల భర్తీ జరుగుతోంది. మొత్తం 52 ఖాళీలున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆర్మీ పబ్లిక్ స్కూల్‌-APS. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.apsbolarum.edu.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. Army Public School, Bolarum, Secunderabad పేరుతో డీడీ తీసి దరఖాస్తు ఫామ్, విద్యార్హతల జిరాక్స్ కాపీ, స్కోర్ కార్డు కాపీలు జత చేసి నోటిఫికేషన్‌లో తెలిపిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి. స్వయంగా ఇవ్వాలి. దరఖాస్తుల్ని ఇమెయిల్ ద్వారా స్వీకరించరు. కొద్ది రోజుల క్రితమే ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉద్యోగాలు కోరుకునేవారికి అర్హత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ తమ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఇటీవల గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీలు- 52 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)- 8 (హిస్టరీ-1, జాగ్రఫీ-1, మ్యాథ్స్-1, కెమిస్ట్రీ-1, సైకాలజీ-1, కంప్యూటర్ సైన్స్-1, ఫిజికల్ ఎడ్యుకేషన్-1) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)- 18 (ఇంగ్లీష్-2, హిందీ-2, సంస్కృతం-2, మ్యాథ్స్-2, ఫిజిక్స్-1, కెమిస్ట్రీ-1, బయాలజీ-1, కంప్యూటర్ సైన్స్-2, సోషల్ సైన్స్-4)ప్రైమరీ టీచర్ (PRT)- 26 (కంప్యూటర్ సైన్స్-2, స్పెషల్ ఎడ్యుకేటర్-2, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్-1, పీఈటీ-1, డ్యాన్స్-1, యోగా-1) దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 24 దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 20 విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. ఇతర అర్హతలు- AWES స్కోర్ కార్డ్‌తో పాటు సీటెట్, టెట్ క్వాలిఫై కావాలి. దరఖాస్తు ఫీజు- రూ.100 దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్