ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

 


కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మాస్కులు ఎవరు ధరించాలి.. ఎప్పుడు ధరించాలి.. ఎక్కడ ధరించాలి అనే అంశాలపై పలు కీలక సూచనలు చేసింది. కార్లు, సరైన వెంటిలేషన్ సౌకర్యం లేని ఇళ్లు, కార్యాలయాల్లో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. అలాగే ఏసీ గదుల్లో గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని, ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొంది. నాణ్యమైన మాస్కులు ధరించాలని, వదులుగా ఉండే మాస్కులను ధరించొద్దని సూచించింది. ఇక వ్యాయామం చేస్తున్న సమయంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించారు. అలాగే చిన్న పిల్లలకు కూడా మాస్కులు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.