నీటి పారుదల శాఖ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష.

 


ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉంటున్నారు. రోజూ ఏదో ఒక శాఖపై సమీక్షలు జరుపుతున్నారు. నేడు రాష్ట్ర నీటిపారుదల రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు హాజరయ్యారు. త్వరలో అపెక్స్ కౌన్సిల్ రెండవ సమావేశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సిద్ధం అని గతంలోనే కేంద్ర జలశక్తి సంఘానికి కేసీఆర్ తెలిపారు. కాగా, నేటి సమీక్షలో అపెక్స్ కౌన్సిల్‌కి డీపీఆర్‌ల సమర్పణ, ప్రాజెక్టుల నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. కాగా, శనివారం నాడు రాష్ట్ర వ్యవసాయరంగంపై సమీక్ష జరిపిన విషయం తెలిసిందే. ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకొవచ్చునని స్పష్టమైన ప్రకటన చేశారు