ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.

 


ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 29వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 50.47 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున సుమారు రూ. 1,009 కోట్లు చెల్లించనుంది. ఇదిలా ఉంటే గతంలో వైఎస్సార్ రైతు భరోసా పధకం కింద రెండు విడతల్లో రైతులకు రూ. 11,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు నష్టపోతే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే నవంబర్‌లో వచ్చిన నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు కూడా ఈ నెల 29వ తేదీన సుమారు రూ.718 కోట్ల పెట్టుబడి రాయితీని ప్రభుత్వం అందించనుంది.