ప్రముఖ ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా కీలక నిర్ణయం

 


హైదరాబాద్‏లోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్‏కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ సంస్థతో ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా నియంత్రణకు కోవాక్స్ తయారు చేసిన మల్టీటోప్ పెప్టైడ్ వ్యాక్సిన్ యూబీ-612 ను తయారీలను మరియు అమ్మకాలను హైదరాబాద్‏లోని అరబిందో ఫార్మా సంస్థ చేపడుతుంది. అయితే ఈ వ్యాక్సిన్‏ను భారత్‏తోపాటు యునిసెఫ్‏కు కూడా సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా అరబిందో ఫార్మా ఎండీ ఎన్. గోవిందరాజన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఈ వ్యాక్సిన్ తయారీ మరియు అమ్మకాలను సంబంధించిన నాన్ ఎక్స్‏క్లూజివ్ హక్కులను తీసుకున్నామని తెలిపారు. ఫినిష్ట్ డోసేజెస్‏ను ఇక నుంచి హైదరాబాద్‏లోని అరబిందో ఫార్మాకు సంస్థకు చెందిన ప్లాంట్లలో తయారు చేస్తామని తెలిపారు. అటు యునైటెడ్ బయోమెడికల్‏కు చెందిన కోవాక్స్ ప్రస్తుతం యూబీ-612 వ్యాక్సిన్ క్యాండిడేట్ తొలి దశ ఔషద ప్రయోగాలను నిర్వహిస్తోంది. కాగా ప్రస్తుతం కంపెనీకి 22 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని, 2021 జూన్ నాటికి సుమారు 48 కోట్ల డోసుల స్థాయికి చేర్చనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ల తయారీ మరియు అమ్మాకాలలో ఒక్కటైన అరబిందో యూబీ-612ను మరింత అభివృద్ది చేసేందుకు తమకు సరైన భాగస్వామి అరబిందో ఫార్మా సంస్థ అని కోవాక్స్ కో-ఫౌండర్ మేయ్ మేయ్ హు అన్నారు.