ఛత్తీస్ .ఘడ్ లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు

 


ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందుపాత‌ర‌లో కోబ్రా డిప్యూటీ క‌మాండ‌ర్ మ‌ర‌ణించారు. బ‌స్త‌ర్ రీజియ‌న్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతుండ‌గా, మావోయిస్టులు ఈ మందుపాత‌ర‌ను పేల్చారు. దీంతో కోబ్రా బెటాలియ‌న్ డిప్యూటీ క‌మాండ‌ర్ వికాస్ కుమార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సిబ్బంది వెంట‌నే హెలికాప్ట‌ర్ ద్వారా రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌రలించ‌గా, అక్క‌డ చికిత్స పొందుతూ సోమ‌వారం మృతి చెందిన‌ట్లు బ‌స్త‌ర్ రేంజ్ ఐజీ సందేరాజ్ వెల్ల‌డించారు. కాగా, నిన్న కాసారం నాలా ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కోబ్రా క‌మాండోలే ల‌క్ష్యంగా మావోయిస్టులు ఈ ఐఈడీని పేల్చిన‌ట్లు చెప్పారు. మృత‌దేహాన్ని ఈ రోజు మ‌ధ్యాహ్నం ఢిల్లీకి త‌ర‌లిస్తామ‌న్నారు. న‌వంబ‌ర్ 29న కూడా సుక్మా జిల్లాలోని తాల్మెట‌లా ప్రాంతంలో మావోయిస్టులు మందుపాత‌ర‌ను పేల్చారు. ఈ ఘ‌ట‌న‌లో కోబ్రా అసిస్టెంట్ క‌మాండ‌ర్ మ‌ర‌ణించ‌గా, మ‌రో ఎనిమిది మంది గాయ‌పడ్డారు.