ఏలూరులో అంతుచిక్కని వ్యాధి.

 


ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం వింత వ్యాధితో వణికిపోతోంది. ప్రజలందరు అల్లకల్లోలం అవుతున్నారు. నీళ్లు తాగాలన్నా, తిండి తినాలన్నా, చివరకు పిల్లలకు పాలు ఇవ్వాలన్నా భయపడుతున్నారు. ఇప్పటివరకు 500 మందికి పైగానే ఆస్పత్రిలో చేరారు. ముగ్గురు మృతిచెందారు. ఈ వ్యాధికి గల కారణాలు ఏంటన్న దానిపై శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. దీనిపై ఎన్‌ఐఎన్, ఐఐసీటీ, ఎయిమ్స్‌ ఢిల్లీ, ఎయిమ్స్‌ మంగళగరి, డబ్ల్యూహెచ్‌ఓ, సీసీఎంబీకి చెందిన నిపుణులు సాంపిల్స్ సేకరించి అధ్యయనం చేస్తున్నారు. ఇవాళ వింత వ్యాధికి గల కారణాలను వెల్లడిస్తామని తెలిపారు.