నాని "టక్ జగదీశ్ "సినిమా ఫస్ట్ లుక్ విడుదల.

 


నేచురల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీశ్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. ట్విట్టర్ వేదికగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ లుక్‌ను నాని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ పోస్టులో స్పందిస్తూ… ఫ్యాన్స్‌కు ఈసారి ఫుల్ మీల్స్ అంటూ రాసుకొచ్చాడు. కాగా, నాని భోజనం ముందు కూర్చుని కత్తి తీస్తున్న సందర్భాన్ని ఫస్ట్ లుక్‌లో భాగంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు గతంలో నానితో నిన్ను కోరి అనే ఎమోషనల్ మూవీ తీశాడు. ఈ చిత్రాన్ని షైన్ స్ర్కీన్స్ సమర్పిస్తోంది. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. నాని ఈ సినిమాతో పాటు శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా దర్శకుడు మారుతితో మరో సినిమా చేసే అవకాశాలున్నాయి.