రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలు ....?

 


తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. తక్కువ సమయంలోనే ఎక్కవ గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా హీరో. అయితే చిరంజీవి నట వారసుడిగా 2007లో చిరుత సినిమాతో తెరంగేట్రం చేసాడు రామ్ చరణ్. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. అయితే రామ్ చరణ్ తన కెరీర్ లో నో చెప్పిన సినిమాలు ఏంటో చూద్దామా. నేల టిక్కెట్టు సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి విజయాల తర్వాత నేల టిక్కెట్టు కథ రాసుకుని చరణ్ దగ్గరికి వెళ్లాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. కానీ కథ నచ్చక ముందు హిట్స్ ఇచ్చినా కూడా నో చెప్పేసాడు రామ్ చరణ్. మేర్లపాక గాంధీ కళ్యాణ్ కృష్ణ మాదిరే, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో వరస విజయాలు సాధించాడు. అలాంటి టైంలోనే ఆయన చరణ్‌కు కృష్ణార్జున యుద్ధం కథ వినిపించాడు. కానీ నాయక్ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం.. కథ కూడా రొటీన్‌గానే ఉండటంతో ఈ సినిమాకి నో చెప్పాడు చరణ్. ఆ తర్వాత గీతాంజలి లాంటి క్లాసిక్ తర్వాత తెలుగులో సినిమా చేయని మణిరత్నం.. చరణ్ కోసం ఓకే బంగారం కథ వినిపించాడు. అయితే ఆ సమయంలో బ్రూస్లీ సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమా మిస్ అయిపోయాడు చరణ్. ఆ సినిమాతోనే దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో మంచి గుర్తింపు పొందాడు. ఇక నాని హీరోగా వచ్చిన ఈ సినిమా కథను ముందు రామ్ చరణ్ కే చెప్పాడు గౌతమ్. అయితే ఆరెంజ్ డిజాస్టర్ కావడంతో లవ్ స్టోరీస్ వద్దనుకున్నాడు చరణ్. అలా నాని చేతికి వెళ్లింది ఎటో వెళ్లిపోయింది మనసు. చిరుత విడుదలైన ఏడాది లోపే ఈ కథ తీసుకొచ్చి చరణ్ కు చెప్పాడు గౌతమ్. కానీ అంత సాఫ్ట్ సినిమా చేయడం చరణ్ కు యిష్టం లేదు. పైగా మగధీర కోసం సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత అదే కథ సూర్యతో చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సూర్య.