ఆచార్య సెట్లోకి చిరుత వచ్చింది. ఈ విషయాన్ని ఆ మూవీ ఆర్ట్ డైరెక్టర్ సురేస్ సెల్వరాజ్ ట్వీట్ చేశారు. అయితే వచ్చింది చిరుత పులి కాదు… చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కాగా, రామ్ చరణ్ రాకను ఆర్ట్ డైరెక్టర్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ‘సర్.. సెట్ గురించి మీ ప్రశంసలు నాకెంతో విలువైనవి. నేను మరింత శ్రమించేందుకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి’ అని సురేశ్ పేర్కొన్నారు. ట్వీట్ ఇదే… ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదాపడిన ఆచార్య చిత్రం షూటింగ్ తిరిగి ఇటీవలే ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ సెల్వరాజన్ వేసిన సెట్లో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి రామ్చరణ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు