టిఆర్పి స్కామ్ లో కీలక వ్యక్తి అరెస్ట్.

 


టీఆర్పీల విషయంలో కొన్ని చానెళ్లు అక్రమాలకు పాల్పడినట్లు ఇటీవల బార్క్ నివేదికలో వెల్లడైన సంగతి అందరికి తెలిసిందే. దీంతో పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్కరు వెలుగులోకి వస్తున్నారు. ఈ కేసును చేపట్టిన ముంబై క్రైం డిపార్ట్‌మెంట్ పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ సీఈవో వికాస్‌ను కూడా పోలీసులు గతవారం అరెస్ట్ చేశారు. తాజాగా మరో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బార్క్ (బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) మాజీ సీఈవో రోమిల్ రామ్‌గరియానుఅరెస్ట్ చేశారు. టీఆర్పీల అక్రమ కేసుకు సంబంధించి విచారించడానికి ఇతడిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. త్వరలోనే న్యాయస్థానంలో గరియాను ప్రవేశపెడుతామని తెలిపారు. కాగా రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ సీఈవో వికాస్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు.