విశాఖ నగరంలో మత్తు మాఫియా.

 


ఆహ్లాదకరమైన విశాఖ నగరం ఇప్పుడు గంజాయి మత్తులో తూగిపోతోందా? ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా కావాల్సిన విశాఖ ఇప్పుడు గంజాయి సరఫరాకు కేంద్ర బిందువుగా మారుతుందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో గంజాయి సరఫరాతో పాటు వినియోగంలోనూ విశాఖ నగరం పేరు మారుమోగిపోతోంది. గంజాయిని తరలిస్తూ పట్టుబడిన కేసులు వరుసగా నమోదువుతున్నాయి. మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందకు అధికారులు అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. మాఫియా మాత్రం నిరంతరం తన ప్రణాళికలు మారుస్తూ కొత్త కొత్త మార్గాల ద్వారా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను సరఫరా చేస్తోంది. తాజాగా హాఫీష్ ఆయిల్ పట్టుబడడటమే ఇందుకు నిరద్శనంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే విశాఖ పరిధిలో గంజాయి సరఫరా, వినియోగానికి సంబంధించి ఎస్ఈబీ ఏడీసీపీ అజిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు మూడు ఎన్డీపీఎస్ కేసులను డిటెక్ట్ చేశామని చెప్పారు. నేరుగా గంజాయి తెస్తే సమయ్య అవుతుందని భావించిన స్మగ్లర్లు.. గంజాయి నుంచి ఆయిల్ తయారు చేసి తరలిస్తున్నారని అజిత వెల్లడించారు. అలా విశాఖ ఏజెన్సీ నుంచి ఆయిల్ తెస్తూ యువతకు ఎర వేస్తున్నారని చెప్పారు. తాజాగా దువ్వాడలో గ్యాస్ సిలిండర్, ఆటో సీటు కింద గంజాయి పెట్టి తరలించడాని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఏడీసీపీ అజిత్ తెలిపారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్‌‌లో తరలిస్తున్న మరో 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు.. హైదరాబాద్‌కు చెందిన యువకులను అరెస్ట్ చేశామన్నారు. గాజువాక జింక్ గేట్ వద్ద 138 బాటిళ్ల నకిలీ లిక్కర్‌ను కూడా సీజ్ చేశామన ఆమె చెప్పారు. ఎక్కడైనా డ్రగ్స్, లిక్కర్ సరఫరా గానీ, వినియోగం గానీ జరిగినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఎస్ఈబీ ఏడీసీపీ అజిత్ సూచించారు.