చంద్రుని పై దిగిన చైనా రోబో

 


బీజింగ్‌: చంద్రుడిపై నుంచి రాళ్లు, మట్టి నమూనాలు భూమికి తీసుకొచ్చేందుకు చైనా పంపిన లూనార్‌ రోబో చందమామపై మంగళవారం విజయవంతంగా దిగింది. ముందుగా నిర్దేశించిన ప్రాంతంలోనే చాంగే 5 వ్యోమనౌక దిగిందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. చంద్రుడిపైకి మనిషిని పంపించే ప్రాజెక్టులో భాగంగా ముందుగా ఈ రోబోను చైనా అంతరిక్ష ప్రయోగ సంస్థ పంపింది. చందమామ ఉపరితలంపై మట్టి, రాళ్లు సేకరించి పరిశోధన చేయటం ద్వారా భవిష్యత్‌లో అక్కడ మనిషి జీవనానికి వీలవుతుందో లేదో తెలుసుకోవడమే ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశం