గన్ తో మెగాపవర్ స్టార్ చరణ్. ఫిదా అవుతున్న అభిమానులు.

 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చరణ్. తాజాగా తన సోదరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘షూట్ అవుట్’ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు చరణ్. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25 న ప్రముఖ ఓటీటీ వేదికగా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రోమోను రాంచరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డమ్మీ గన్ తో సరదాగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చాడు చరణ్. ఈఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గన్ తో చరణ్ స్టిల్స్ మెగా అభిమానులు ఆకట్టుకుంటున్నాయి. ప్రవీణ్ చంద్ అనే హైదరాబాద్ డీఎస్పీ కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ సిరీస్ లో హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు