వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.


 

ఇటీవల కాలంలో ప్రముఖ మేసేజింగ్ సంస్థ వాట్సాప్ వరుసగా కొత్త అప్‏డేట్లను అందిస్తోంది. తాజాగా మరో కొత్త అప్‏డేట్‏ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందేంటంటే.. పేస్ట్ మల్టిపుల్ ఐటెమ్స్. అంటే ఒకేసారి ఎక్కువ ఫోటోలు, వీడియోను వాట్సాప్‏లోకి పంపడం. ఇది వాట్సాప్ కొత్త బీటా వెర్షన్ ఐవోఎస్ 2.21.10.23లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్‏ను ఎలా వాడలంటే.. ముందుగా మీ ఫోన్‏లోని ఫోటోస్ యాప్‍లో ఉన్న కొన్ని ఫోటోలను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఎక్స్‏పోర్ట్ ను క్లిక్ చేసి తర్వాత కాపీ చేయాలి. ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి చాట్‏బార్‏లో ఆ ఫోటోలను పేస్ట్ చేయాలి. అంతే మీరు పేస్ట్ చేసిన ఫోటోలను అన్ని మీకు కావాల్సిన వారికి పంపోచ్చు. వీటితోపాటు బగ్ పిక్స్‏లతోపాటు మరి కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వాబీటాఇన్ఫోలో తెలిపారు. స్టేటస్ అప్‏డేట్‏లు సెర్చ్ చేయడం, వాయిస్, వీడియో గ్రూప్ ఫోన్లలో ఉన్న లోపాలను సరిచేశామని తెలిపారు. అంతేకాకుండా కొత్త కాంటాక్ట్‏లను సరిచేయడం, యూఆర్ఎల్స్‏ను షేర్ చేయడం వంటి మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వాట్సాప్ వెబ్ నుంచి వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.