పడిపోతున్న పసిడి ధరలు.

 


కోవిడ్‌-19కి సంబంధించిన పలు వ్యాక్సిన్లు త్వరలోనూ అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. అయితే ఇది బంగారం ధరలపై ప్రభావం చూపింది. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ బంగారం ధర 10 డాలర్లు పతనంకాగా.. వెండి కూడా 1 శాతం క్షీణించింది. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 50,000కు పడిపోయింది. వెండి కేజీ రూ. 65,000 మార్క్‌ను కోల్పోయింది. ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 395 క్షీణించి రూ. 49,714కు అటుఇటూ ట్రేడవుతోంది. వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ మరింత అధికంగా రూ. 890 పతనమై రూ. 64,302 వద్ద ఉంది. ఇక స్పాట్‌ మార్కెట్లోనూ బంగారం 0.6 శాతం నష్టంతో 1,860 డాలర్లకు చేరింది. వెండి సైతం 1 శాతం వెనకడుగుతో ఔన్స్ 24.49 డాలర్ల వద్ద కదులుతోంది.