ఏపీలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి .

 


ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీని సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్కార్ ఆస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో డాక్టర్లు, వైద్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమించడానికి ఆమోదం తెలిపారు. త్వరలోనే నియామకప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇక, ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో డైరెక్టర్‌ మెడికల్‌ విద్య, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌ కింద ఆస్పత్రుల్లో మొత్తం 7,590 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి అనుమతించగా ఇప్పటి వరకు 6,106 పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్‌ మెడికల్‌ విద్య, ఏపీ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్‌ పబ్లిక్‌ హెల్త్‌ కింద 2,120 పోస్టులు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 1,528 పోస్టులను భర్తీ చేశారు. మిగతా 592 పోస్టుల భర్తీ ప్రాసెస్‌లో ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లా స్థాయిలో మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసా