కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన.

 


ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్​ వరకు దాదాపు మూడు కిలీమేటర్ల వరకు నిర్మించనున్న సెంట్రల్​ విస్టా ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సెంట్రల్​ విస్టా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. జస్టిస్​ ఏఎం ఖాన్ ​విల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనం ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. పెండింగ్​లో ఉన్న పిటిషన్లపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టకూడదని చెప్పింది. అయితే డిసెంబర్​ 10న నూతన పార్లమెంట్​ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.971 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 2022లోపు దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించాయి. కొత్త పార్లమెంట్‌ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ నిర్మించనుంది. అయితే కొత్త పార్లమెంట్ భవనానికి కేవలం భూమిపూజ మాత్రమే నిర్వహించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి స్పష్టతనిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో లోక్ సభ సభ్యుల కోసం 888 సీట్లు, రాజ్య సభ సభ్యుల కోసం 326 సీట్లు ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం 1224 మంది సభ్యులు కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్ విస్టా భవనం ప్రాజెక్టుకు రూ.11,794 కోట్లుఖర్చవుతుందని అంచనా. అయితే ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిది. దీనికి 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది.దీనికి 83 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. దీన్ని 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్ట్ ఇర్విన్ ప్రారంభించారు.