చాక్లెట్ తినడం వల్ల వారి మెదడు చురుకుగా పనిచేస్తుంది.

 


వయసు మీద పడిన కొద్ది మతిమరుపు పెరుగుతూ పోతుంది. ఇది మానవ సహజ లక్షణం. అయితే ఇది క్రమానుసారంగా జరిగితే బాగానే ఉంటుంది కానీ కొంతమంది ఎక్కువగా మతిమరుపునకు గురవుతూ ఉంటారు. అందుకే దీని భారిన పడకుండా ఉండేందుకు చాక్లెట్లు తినాలని చెబుతున్నారు బర్మింగ్‌హమ్ యూనివర్సిటీ పరిశోధకులు. దీనిపై ఓ అధ్యయనం కూడా చేశారని చెబుతున్నారు. 18 మందిపై జరిపిన పరిశోధనలో 14 మంది రోజూ చాక్లెట్ తినడం వల్ల వారి మెదడు చురుకుగా పనిచేసినట్లు గుర్తించామని తెలిపారు. దీంతో మతిమరుపు నివారించడానికి చాక్లెట్లు తినాలని సూచిస్తున్నారు. అయితే చాలామంది చాక్లెట్లు తింటే దంతాలు పాడైపోతాయని అనుకుంటారు. కానీ చాక్లెట్ నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది. ఈ విషయం తెలియక అందరు గాబరాపడుతుంటారు. చాక్లెట్లలలో ఉండే పాలీ ఫెనాల్స్, గుండెలోని కణాలకు హాని చేసే రసాయనాలను నివారిస్తాయి. మిగిలిన తినుబండారాలతో పోలిస్తే చాక్లెట్ తినడం ఎంతో ఉత్తమం అంటున్నారు. కూరగాయలు, పండ్లలో కూడా చాక్లెట్లలలో లభించే పోషకాలు ఉంటాయట కానీ అవి మెదడు తీరుపై అంతగా ప్రభావం చూపవట. ఇదండీ విషయం మీరు కూడా రోజూ చాక్లెట్ తిని అల్జీమర్స్ నుంచి బయటపడండి.