ప్ర‌కాశం జిల్లాల్లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.

 


ప్ర‌కాశం జిల్లాల్లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మ‌ద్దిపాడు మండ‌లం ఏడుగుండ్ల‌పాడు ఫ్లైఓవ‌ర్‌పై లారీని ద్విచ‌క్ర‌వాహ‌నం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ప్ర‌మాదంపై స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. మృతుల‌ను బల్లికుర‌వ మండ‌లం అల‌న‌డ‌క వాసులుగా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.