జియో కస్టమర్ లకు జాగ్రత్త.....

 


కరోనా వైరస్ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ళు తెగ రెచ్చిపోతున్నారు. తాజాగా జియో కస్టమర్ సర్వీస్ పేరిట కొత్తరకం మోసానికి తెరతీశారు. ముందుగా జియో కస్టమర్లకు కాల్ చేసి మీ సిమ్ బ్లాక్ అవుతుందని.. వెంటనే రీఛార్జ్ చేయాలి అంటూ జియో కస్టమర్ కేర్ నుంచి ఫోన్లు చేస్తున్నట్లుగా కస్టమర్లను నమ్మిస్తారు. రిమోట్ యాక్సెస్ యాప్ ద్వారా రిఛార్జ్ చేయాలని చెబుతున్నారు. ఆ యాప్ ద్వారా రిఛార్జ్ చేసిన కస్టమర్ అకౌంట్లో నుంచి డబ్బులు మాయం చేస్తున్నారు. ఇటీవల ఇద్దరు మహిళల నుంచి రూ.2.7 లక్షల వరకు నగదును మాయం చేశారు సైబర్ నేరగాళ్ళు. దీంతో ఆ ఇద్దరు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్టట్టారు. జియో కస్టమర్లు ఈ తరహ సైబర్ నేరగాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.