కేంద్రం మరో కీలక నిర్ణయం.

 


కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఏ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్‌ను అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందిస్తోంది. ఈ డబ్బులు మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇకపై, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్సీలకు కూడా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని యోచిస్తోంది. రైతుల మాదిరిగానే మరిన్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా నేరుగా డబ్బులు అందించాలనే ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫార్సు చేసినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు నేరుగా డబ్బులు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నెలకు రూ.5,000 కన్నా తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారికి ఈ ఫథకం వర్తించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీలకు అందించే స్కీమ్స్‌‌‌లో 40 శాతం మొత్తాన్ని ఇలా నేరుగా వారి అకౌంట్లలో వేస్తే ప్రయోజనం ఉంటుందని నీతి ఆయోగ్ తెలిపింది. అలాగే మిగతా 60 శాతం మొత్తాన్ని వీరు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు వినియోగించాలని పేర్కొంది. అయితే ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ, నీతి ఆయోగ్ గానీ స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బలహీన వర్గాల కోసం కొంత మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయిస్తుంది. ఈ మొత్తాన్ని ఆయా మంత్రిత్వ శాఖలు సరిగా వినియోగించడం లేదని గుర్తించింది. దీంతో కేంద్రం ఈ డబ్బులతో కొత్త స్కీమ్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. తద్వారా ఎస్సీ, ఎస్టీలకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకే నేరుగా డబ్బులు జమ చేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌లో ఎస్సీఎస్పీ కింద రూ.83,257 కోట్లు, టీఎస్పీ కింద రూ.53,653 కోట్లు కేటాయించింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం.. నెలకు రూ.5,000 కన్నా తక్కువ సంపాదించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు 92 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. 2020-21 బడ్జెట్ కేటాయింపుల ప్రకారం చూస్తే.. ఒక్కో కుటుంబానికి నెలకు రూ.5 వేలు లభిస్తాయి. అదే రూ.10 వేల ఆదాయంలోపు అందిస్తే.. కుటుంబానికి నెలకు రూ.1,310 అందించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కొత్త ప్రతిపాదనలపై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది