ఉద్యోగ ముగిసిన సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ.

 


ప్రభుత్వ ఉద్దేశాలేంటి.. ఉద్యోగులకు ఉన్న సమస్యలు ఏంటి.. PRC అమలుపై ఉద్యోగులుకు ఉన్న అభ్యంతరాలేంటి? ఇలాంటి అంశాలపై ప్రగతి భవన్‌లో ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఏపీలో ఉన్న 850 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతిశాఖలో పదోన్నతులు త్వరితగతిన చేయిస్తామన్నారు. జనవరి నెలాఖరులోగా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఉద్యోగులతో సీఎం కేసీఆర్ చెప్పారు. జనవరిలో వయోపరిమితి, పీఆర్‌సీ ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. వీటితోపాటు.. మరిన్ని అంశాలపై ఆయన ఉద్యోగులతో చర్చించారు.