విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్.

 


టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీని రెచ్చగొడితే ఊచకోత కోస్తాడని చెబుతున్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్. త్వరలో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో తనతో జాగ్రత్తగా ఉండాలని సహచరులకు సూచిస్తున్నాడు. రెండు జట్లలో మంచి వాతావరణం నెలకొని ఉందని దానిని పాడుచేయవద్దని హితవు చెబుతున్నాడు. ఇరు జట్ల మధ్య ఎన్నోరోజుల నుంచి మాటల యుద్దం నడుస్తుందని కానీ అదుపులో ఉంటే అందరికి మంచిదని తెలిపాడు. ఐపీఎల్‌లో బెంగుళూర్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. జట్టును నడిపించడంలో ఆయన వేసే ప్రణాళికలు అద్భుతం అని ప్రశంసించాడు. ప్రతి ఆటగాడికి సరైన గౌరవం ఇచ్చి అతడిపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తంచేస్తాడని చెప్పాడు. కోహ్లీ ఒక వ్యక్తిగా గ్రౌండ్ బయట చాలా ప్రశాంతంగా ఉంటాడని పేర్కొన్నాడు. కాగా ఈ నెల 17 నుంచి రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా ట్వంటీ ట్వంటీ సిరీస్‌ను భారత్ గెలుపొందింది. అయితే తొలి టెస్ట్ తర్వాత విరాట్ ఇండియాకు రానున్న సంగతి అందరికి తెలిసిందే