చిరంజీవి సరసన గోవా బ్యూటీ ఇలియానా ...?

 


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమాపూర్తి చేసే పనిలో ఉన్నాడు చిరంజీవి. ఈ సినిమా పూర్తయిన వెంటనే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు చిరు. దీనితోపాటు మలయాళం సూపర్ హిట్ సినిమా బ్యూటీ ఇలియానా ’ సినిమాను కూడా రీమేక్ చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయే దర్శకుడి పై చాలా చర్చే జరిగింది. చాలా మంది పేర్లు కూడా వినిపించాయి. మొదట్లో యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడని ప్రకటించారు. ఆ తరవాత అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆతర్వాత యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని అన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఈ సినిమానుంచి తప్పుకున్నాడు. ఇక ఈ సినిమా చివరకు స్పెషలిస్టు మోహన్ రాజా చేతిలో పడింది. ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ గురించి చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ అంటూ ఇప్పటికే పలువురి పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా గోవా బ్యూటీ ఇలియానా పేరు వినిపిస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓవెలుగు వెలిగిన ఈ అమ్మడు. తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. ఆతర్వాత లవ్, బ్రేకప్ , డిప్రషన్, బరువు పెరిగిపోవడం ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. తిరిగి టాలీవుడ్ లోకి రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో మళ్ళీ తెలుగు సినిమా వైపు చూడలేదు ఇలియానా. కానీ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.