నేరేడ్​మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు కు లైన్ క్లియర్.

 


నేరేడ్​మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి క్లారిటీ వచ్చింది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకొని లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇతర గుర్తులున్న 544 ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాన్ని ప్రకటించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధి​లో నిలిచిపోయిన నేరేడ్​మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. వివాదస్పద ఇతర ముద్రల ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఈనెల 9న ఉదయం 8 గంటలకు నేరేడ్‌మెట్‌ డివిజన్​ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇతర గుర్తులున్న 544 ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితం వెలువడనుంది. స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలతో కూడిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ లీగల్ సెల్ ఇంఛార్జీ ఆంటోనీ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు.