స్ట్రెయిన్ వైరస్ లక్షణాలు.

 


అప్పుడు చైనా.. ఇప్పుడు బ్రిటన్. స్ట్రెయిన్‌గా రూపాంతరం చెందిన కరోనా వైరస్.. మరోసారి ప్రపంచ దేశాల్లో అలజడిని సృష్టిస్తోంది. ఈ వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండటంతో.. ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపధ్యంలోనే బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై ఇండియాతో సహా పలు దేశాలు తాత్కాలికంగా నిషేధం విధించాయి. అలాగే యూరోప్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారు తప్పనిసరిగా RT-PCR పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదిలా ఉంటే కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌వైరస్ మూలాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే కరోనా స్ట్రెయిన్ లక్షణాలపై ఆ దేశ నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) కీలక ప్రకటన చేసింది. జ్వరం, పొడి దగ్గు, వాసన, రుచి కోల్పోవడంతో పాటు 7 కొత్త లక్షణాలు స్ట్రెయిన్‌’ వైరస్ సోకడం ద్వారా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కింద పేర్కొన్న లక్షణాలు ఉంటే తక్షణమే ఆసుపత్రిలో వెళ్లాలని సూచిస్తున్నారు. అలసట ఆకలి లేకపోవడం తలనొప్పి విరేచనాలు మానసిక గందరగోళం కండరాల నొప్పులు