ఆది పురుష్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్.

 


ప్రభాస్ ఆదిపురుష్‌ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్‌ చెప్పారు విలన్ సైఫ్ అలీఖాన్‌. ప్రభాస్‌ రాముడిగా నటిస్తున్న ఈ మూవీలో రావణుడిగా కనిపిస్తున్నారు సైఫ్‌. అందుకే తన క్యారెక్టర్ గురించి ఓ సీక్రెట్‌ రివీల్‌ చేశారు. ఏంటా సీక్రెట్ అనుకుంటున్నారా… ఈ సినిమాలో రావణుడిలోని పాజిటివ్‌ యాంగిల్ చూపించబోతున్నారట. అదేంటి రావణుడు పాజిటివ్‌ అయితే రాముడు విలన్‌ అవుతాడా అనుకుంటున్నారా..? అయ్యయ్యో… అంత కాంట్రవర్సీ ఏం లేదులెండి.. రాముడే హీరో.. రావణుడే విలన్‌… బట్ ఆ విలనిజంలోనూ కాస్త పాజిటివ్ యాంగిల్ కూడా ఉంటుందట.. అదే సైఫ్‌ రివీల్‌ చేసిన సీక్రెట్‌.. అంటే రావణుడి మీద కూడా రెస్పెక్ట్ పెరిగేలా కొన్ని సీన్స్ ఉంటాయన్నది సైఫ్ ఇస్తున్న హింట్‌. శూర్పణఖ ముక్కు చెవులను లక్ష్మణుడు కోసే సీన్‌.. సీతను కిడ్నాప్‌ చేసే సీన్స్‌ సూపర్బ్‌గా ఉంటాయని ఆడియన్స్‌ను మరింత ఊరిస్తున్నారు ఈ బాలీవుడ్ ఖాన్‌ సాబ్. తానాజీ ఫేం ఓం రౌత్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సీత ఎవరన్నది ఇంకా కన్‌ఫాం కాలేదు. క్రితి సనన్‌ పేరు కాస్త గట్టిగానే వినిపిస్తున్నా.. టీం మాత్రం కమిట్ అవ్వట్లేదు. చూడాలి మరి డార్లింగ్‌ సరసన సీతగా ఎవరు నటించబోతున్నారో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.