టీమిండియాకు స్లో ఓవర్ రేటింగ్ కారణంగా జరిమానా

 


ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ కైవసం చేసుకుని హ్యాపీ మూడ్‌లో ఉన్న టీమిండియాకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా భారత జట్టుకు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో టీమిండియా ఒక ఓవర్ తక్కువగా వేశారంటూ మ్యాచ్ ఫీజులో 20 శాతం పైన్ వేశారు. ఈ విషయాన్ని మ్యాచ్ రెఫరీ డేవిడ్ బూన్ తెలిపారు. అయితే టీమిండియా సారధి విరాట్ కోహ్లీ జరిగిన పొరపాటును ఒప్పుకున్నాడు. అంతేకాదు.. జరిమానాకు కూడా అంగీకారం తెలిపాడు. దీంతో కోహ్లీ విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఐసీపీ తెలిపారు. కాగా, ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్‌ల్లో భారత్ రెండింటిలో నెగ్గి.. చివరి మ్యాచ్‌ ఓడి పోయిన విషయం తెలిసిందే. చివరి మ్యాచ్‌లో టీమిండిచా 12 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ.. 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది