ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

 


ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. జ్యోతిర్మయి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన నిరుద్యోగులకు శిక్షణ అందించి జ్యోతిర్మయి టెక్స్టైల్స్ సంస్థలో వారికి ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపింది. ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 125 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన విద్యార్థులు గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని గొరిజవోలు గ్రామంలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 9160200652 నంబరుకు ఫోన్ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 10 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 విభాగాల్లో125 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టుల ఆధారంగా 5,8 ఐటీఐ, ఇంటర్ ను విద్యార్హతలుగా నిర్ణయించారు. పోస్టు ఆధారంగా రూ. 7 వేల నుంచి రూ. 8 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -జిల్లా స్కిల్ డవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో శిక్షణ కోసం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. -ఎంపికైన అభ్యర్థులు టెక్నికల్ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ పై జ్యోతిర్మయి టెక్స్టైల్స్ లో శిక్షణ ఉంటుంది-విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు జ్యోతిర్మయి టెక్స్టైల్స్ లో ఉద్యోగం కల్పించబడుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెల రోజుల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్, జ్యోతిర్మయి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అభ్యర్థులకు సర్టిఫికేట్ అందిస్తారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజన, నివాస సదుపాయం కల్పిస్తారు.