ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న భాగ్యనగర కరోనా వాక్సిన్....

 


ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందాని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం కోవిడ్ -19 వ్యాప్తి ప్రారంభమైననాటి నుంచి చాలా దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధిని ప్రారంభించాయి. విశ్వవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు నిర్విరామ కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్‌లు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకుంటున్నాయి. అయితే, వీటిని అభివృద్ధి చేయడం ఒక ఎత్తయితే వీటి ఉత్పత్తి మరో ఎత్తు. దీనిని సమర్థంగా నిర్వహించగల సత్తా ప్రపంచంలోనే కేవలం రెండే రెండు దేశాలకు ఉంది. అవి చైనా, భారత్‌కు మాత్రమే కావడం విశేషం. భారతదేశంలో ఈ సామర్థ్యం కేవలం హైదరాబాద్‌కు మాత్రమే ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా కంపెనీలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా కోసం భాగ్యనగరం వైపు చూస్తున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీకి ప్రపంచంలోనే అనువైన ప్రదేశం హైదరాబాద్‌ మాత్రమేనని నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐదు వ్యాక్సిన్ తయారీ సంస్థలు బయటకు తీసుకురావడానికి రెఢీగా ఉన్నాయి. ఇందులో భారత్ బయోటెక్, బయోలాజికల్ ఇ లిమిటెడ్ సంస్థ సొంతంగా టీకా అభివృద్ధి కోసం టెక్సాస్‌లోని బేలర్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అరబిందో ఫార్మా అభివృద్ధి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రస్తుతం వివిధ దశలలో ఉంది. ఇక, డాక్టర్ రెడ్డీ, హెటెరో వ్యాక్సిన్ తయారీకి వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌లో తయారుచేసేందుకు సాంకేతిక సహాయాన్ని అందజేస్తున్నది. ఇక, ప్రపంచానికే సరఫరా చేయగల వ్యాక్సిన్ మూడింట ఒకవంతు సామర్థ్యం హైదరాబాద్‌‌ కలిగి ఉంది. దేశ మొట్టమొదటి స్వదేశీ కొవిడ్ -19 వ్యాక్సిన్ కొవాగ్జిన్‌, రష్యా స్పుత్నిక్ వీ, జాన్సన్ అండ్‌ జాన్సన్ కంపెనీ ఏడీ 26.సీఓవీ2ఎస్‌, ఫ్లూజెన్ కోరోఫ్లూ, సనోఫీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు హైదరాబాద్‌తో సంబంధం కలిగి ఉన్నాయి. అంటే వాటి ఉత్పత్తి కోసం ఇక్కడి కంపెనీలతో ప్రపంచ ఔషధ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వ్యాక్సిన్‌ అనేది హైదరాబాద్‌లో అభివృద్ధి చేసినా లేదా ప్రపంచంలో ఎక్కడ తయారైనా ఉత్పత్తి, సరఫరా మాత్రం హైదరాబాద్‌నుంచే జరుగుతుందని వైద్య నిపుణలు అంటున్నారు. అన్ని హైదరాబాద్‌ ఫార్మా కంపెనీలు ఉత్పాదక సాంకేతిక పరిజ్ఞానంలో దృఢంగా ఉన్నాయి. అలాగే, మంచి ప్రమాణాలతో మిలియన్‌ మోతాదుల వ్యాక్సిన్లను తయారుచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సనోఫీ కంపెనీ టీకాను 2021 మొదటి భాగంలో ఇక్కడ పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు ఎదురుచూస్తున్నారు. సనోఫీ కంపెనీ 2009 లో శాంత బయోటెక్నిక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలకు కోవిడ్ – 19 వ్యాక్సిన్ ఎగుమతులకు సంబంధించి ఎటువంటి విధానం లేనందున, వ్యాక్సిన్ తయారీదారులను ఎగుమతి చేయడానికి అనుమతించే ముందు దేశీయ అవసరాలు నెరవేర్చవచ్చు. ఇక, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 77 మిలియన్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, దాదాపు రెండు మిలియన్ల మంది మాయదారి వైరస్ బారినపడి మరణించారు. వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా అకాడమిక్‌ ల్యాబోరేటరీలు, వ్యాక్సినేతర సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి. అయితే, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో వారంతా భారత్‌ లేదా చైనాలోని సంస్థల భాగస్వామ్యంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీదారులతో పాటు, ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం వ్యాక్సిన్ రవాణా కోసం కోల్డ్-చైన్ మౌలిక సదుపాయాలను కూడా పెంచింది. కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతి నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో వివిధ వాటాదారులతో చర్చలు జరుపుతోంది. భారత్ బయోటెక్ బీఈ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కోసం వివిధ దేశాలకు చెందిన 60 మంది విదేశీ లరాయబారుల ఇటీవల హైదరాబాద్‌లో సందర్శించారు. భాగ్యనగరం కోవిడ్ – 19 టీకాలు తయారు చేయడంలోనూ, సరఫరా చేయడంలో ముందంజలో ఉందని రాయబారులు కితాబు ఇచ్చారు. “భారత్ బయోటెక్ మినహా ఈ టీకా తయారీదారులందరూ, విదేశీ సంస్థలతో ఒప్పందం మేరకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. భారతదేశం నుండి ఏ పరిమాణంలో ఎగుమతి చేయబడుతుందనే దానిపై మాకు ఒప్పంద వివరాలు తెలియదు. అయితే, ఈ విషయంలో ఎన్డియన్ ప్రభుత్వానికి తుది అభిప్రాయం ఉంది “అని వాణిజ్య శాఖ పరిధిలోని ఫార్మా ఎగుమతి ప్రమోషన్ బాడీ అయిన ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ అన్నారు. ఇదిలావుంటే, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఇక్కడ ఉన్నప్పటికీ, టీకా కేటాయింపులో రాష్ట్రానికి ప్రాధాన్యత లభించదు. ఎందుకంటే ఇది కేంద్రం నిర్ణయిస్తుంది. వ్యాక్సిన్ కేటాయింపులో రాష్ట్రానికి పాత్ర లేదు. ఇది కేంద్రం మాత్రమే నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మోతాదుల సంఖ్యను కేటాయించడానికి ఒక పద్ధతిని అనుసరిస్తుందని శ్రీనివాస్ రావు తెలిపారు. తదనుగుణంగా రాష్ట్రాల వాటాలు లభిస్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 28 న హైదరాబాద్‌లోని భారత్ బయోటెచాట్ జీనోమ్ లోని టీకా అభివృద్ధి సెంటర్‌ను సందర్శించారు. కోవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో సమీక్షించారు. కోవాగ్జిన్ టీకాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం మూడో దశ పరీక్షలను సైతం పూర్తి చేసుకుంది. ఇది పూర్తిగా స్వదేశీల పరిజ్జానంతో రూపొందుతుండటంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే, కోవాగ్జిన్ కాకుండా, BB కూడా ఈ ప్రక్రియలో ఉంది. ఇంట్రానాసల్ అయిన టీకాతో బయటికి వస్తోంది. బయోలాజికల్ ఎల్తాస్ ఫార్మా మేజర్ జాన్సన్ & జాన్సన్ భాగమైన జాన్సెన్ ఫార్మాస్యూటికా ఎన్వితో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం టీకా తయారు చేయడానికి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడం కోసం రెండో దశలో ఉంది. ఇక, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ సభ్యుడైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇటీవల 30 మిలియన్ డాలర్ల వరకు రుణం ప్రకటించింది. పిల్లల సాధారణ రోగనిరోధకత కోసం తక్కువ-ధర, సాధారణ వ్యాక్సిన్ల విస్తరణకు మద్దతు ఇవ్వడానికి, భవిష్యత్తులో ఏదైనా కోవిడ్ వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ నిధులను మంజూరు చేసింది. అరబిందో ఫార్మా వచ్చే ఏడాది ఏప్రిల్-మే నాటికి హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తయారీ సదుపాయాన్ని వాణిజ్యపరం చేయాలని ఆశిస్తోంది. ఈ సౌకర్యం కోసం సుమారు 275 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. ఇది కోవిడ్ వ్యాక్సిన్‌తో సహా వివిధ వైరల్ వ్యాధుల చికిత్సకు సంబందించిన వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడానికి నిర్ణయించుకుంది. ప్రపంచానికి కొవిడ్ -19 టీకాను అందించి, మహమ్మారిని తరిమికొట్టే యుద్ధంలో తెలంగాణ సర్కార్ కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్‌లోని కంపెనీలకు తగిన సహాయ సహకారాలు అందిస్తోంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, రవాణాకు కావాల్సిన అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా గ్లోబల్ టీకా ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నామని కేసీఆర్ ప్రభుత్వం స్పషం చేసింది. ప్రపంచానికి సేవ చేసేందుకుగానూ ఉత్పత్తిని త్వరగా పెంచేందుకు మా కంపెనీలకు ముందుగానే మద్దతు వస్తున్నాయని వెల్లడించింది.