రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నా రైతుల ఆందోళనలు

 


రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో రైతులు చేస్తున్న ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. రైతుల ఆందోళనలు రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అదే సమయంలో వారికి అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతోంది. అమృత్‌సర్‌లో కిసాన్ మజ్దూర్ కమిటీ నాయకులు 700 ట్రాక్టర్లతో ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీ జైపూర్, ఢీల్లీ ఆగ్రా సరిహద్దులను దిగ్భందనం చేశారు. అంతేకాదు టోల్ గేట్ల వద్ద రుసుం చెల్లించకుండా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. రైల్‌రోకో, బీజేపీ నేతల ఘోరావ్, టోలప్లాజాల దగ్గర ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడే రైతులు ఆవేశంతో కాకుండా ఆలోచనతో, వివేచనతో కేంద్రాన్ని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. తద్వారా కేంద్రం మెడలు వంచాలని చూస్తున్నారు. ఆ విధానమేటంటే… టోల్ ప్లాజాల వద్ద ధర్నాలు.. టోల్ కట్టకుండా చూడడం…అయితే టోల్ కట్టకుండా చేయడం ద్వారా కేంద్రాన్ని రైతులు గట్టి దెబ్బే కొట్టేలా ఉన్నారు. అదేలా అంటే… ఒక్కసారి ఈ గణాంకాలను చూద్దాం… తర్వాత సినిమా మీకే అర్థమవుతుంది. భారత్‌లో ఉన్న టోల్ గేట్లు వాటికి వచ్చే ఆదాయాన్ని చూద్దాం… 2019 లో కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం… దేశ వ్యాప్తంగా 562 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఎన్ హెచ్ ఏఐ పరిధిలో 1.4 లక్షల కిలోమీటర్ల రహదారులు ఉండగా… 24,996 కి.మీ టోల్ పరిధిలోకి వస్తాయి. మరో 2వేల కి.మీ.లను టోల్ పరిధిలోకి తేనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రస్తుతం ఏడాదికి టోల్ గేట్ల ద్వారా ఆదాయం రూ. 30 వేల కోట్లు… అక్షరాల ముప్పై వేల కోట్ల రూపాయలు. అయితే ఈ ఆదాయాన్ని కేంద్రం లక్ష కోట్లకు పెంచాలనే ఆలోచనలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 20 టోల్ ప్లాజాలున్నాయి. అయితే, మొదటగా ఉన్న 18 టోల్ ప్లాజాలకు మరో రెండుటోల్ ప్లాజ్ లకు ఎన్ హెచ్ ఏఐ ఇటీవలే అనుమతి ఇచ్చింది. ప్రతినెల ఈ టోల్ గేట్ల ద్వారా 80 నుంచి 90 కోట్ల వరకు ఆదాయం కేంద్రానికి వెళ్తోంది. రానున్న రోజుల్లో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రపదేశ్‌లో 42 టోల్‌ ప్లాజ్‌లు ఉన్నాయి. ఆ టోల్ ‌గేట్ల ద్వారా ప్రతి నెలా రూ.124 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ లెక్కన కేంద్ర రైతులకు సంఘీభావంగా దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులు కేవలం టోల్ ప్లాజాల వద్ద ధర్నాలు చేస్తే కేంద్రానికి ఇక చుక్కలే… అన్ని రాష్ట్రాల టోల్ ప్లాజాల వద్ద ధర్నాకు రైతు సంఘాలు ఇప్పటికే పిలుపునిచ్చాయి. హర్యానా రైతులు ఆ రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలెవరినీ టోల్ కట్టకుండా చూస్తున్నారు. రాష్ట్రాల వారిగా టోల్‌ ప్లాజాలలోని ఆదాయ వివరాలు 2015-16 నుంచి 17-18 వరకు కోట్లల్లో సంఖ్య రాష్ట్రం 2015-16 2016-17 2017-18 1. ఆంధ్రప్రదేశ్ 1216.21 1188.54 1496.57 2. బీహార్ 547.37 591.79 811.98 3. చత్తీస్ గఢ్ 205.95 240.68 162.17 4. గుజరాత్ 1774.70 1953.31 2334.63 5. హర్యానా 708.49 711.51 998.04 6. జమ్ము, కశ్మీర్ 62.50 73.89 79.11 7. జార్ఖండ్ 187.36 174.18 236.32 8. కర్ణాటక 1413.46 1452.40 1773.71 9. కేరళ 137.48 138.01 167.76 10. మధ్యప్రదేశ్ 599.27 587.74 702.39 11. మహారాష్ట్ర 2419.37 2292.39 2708.61 12. ఈశాన్య రాష్ట్రాలు 1.61 39.55 47.63 13. ఒడిశా 379.18 422.55 603.76 14. పంజాబ్ 547.21 563.80 690.16 15. రాజస్థాన్ 2602.87 2788.79 3276.36 16. తమిళనాడు 1958.93 2075.02 2378.69 17. తెలంగాణ 679.50 704.69 854.60 18. ఉత్తరప్రదేశ్ 1944.01 1979.22 2411.84 19. ఉత్తరాఖండ్ 1.76 1.85 19.06 20. పశ్చిమ బెంగాల్ 800.00 951.72 1178.15 మొత్తం 18,148.75 18,893.27 22, 820.58