తెలంగాణ హైకోర్టు చీఫ్‌గా జస్టిస్ హిమా కోహ్లీ.

 


తెలంగాణ హైకోర్టు చీఫ్‌గా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టు జడ్డిగా ఆమె సేవలందించారు. హిమా కోహ్లీ 1959 సెప్టెంబర్ 2 న ఢిల్లీలో జన్మించారు. 1979 లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్ హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్‌లో ‘లా’ అధ్యయనం చేశారు. మరోవైపు ఒరిస్సా హైకోర్టు చీఫ్‌గా జస్టిస్ మురళిధర్ నియమితులయ్యారు