నోకియా సంస్థ నుండి స్మార్ట్ ఏసీలు విడుదల. లో కాస్ట్ హై ఫీచర్స్ .

 నోకియా సంస్థ స్మార్ట్‌ఫోన్ల రంగంలో తిరిగి తన సత్తా చాటుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నోకియా ఎయిర్ కండిషనర్లను ఉత్పత్తి చేస్తోంది. అది కూడా మ‌న‌దేశంలోనే తయారు చేస్తోంది. ఈ నోకియా ఏసీల్లో అత్యాధునిక ఫీచ‌ర్లు క‌లిగి ఉన్నాయి. ఈ మోడ‌ళ్లు వై-ఫై-కనెక్ట్ చేసిన స్మార్ట్ క్లైమేట్ కంట్రోల్, కస్టమైజ్డ్ యూజర్ ప్రొఫైల్‌లతో కూడా వస్తాయి. అయితే ఇవి ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లోనే అందుబాటులో ఉంటాయి. ధర ఎంతంటే… నోకియా ఎయిర్ కండిషనర్లు డిసెంబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ధర రూ.30,999. అయితే ఈ ఏసీల‌లో మొత్తం ఐదు వేరియంట్లు ఉండనున్నాయి. టన్నుల తేడా మరియు శక్తి సామర్థ్యాల‌ను బ‌ట్టి ధ‌ర‌లు ఉంటాయి. నోకియా ఎయిర్‌కండీష‌న‌ర్స్ ఫీచ‌ర్ల విషయానికొస్తే ఇందులో ఫోర్ ఇన్ వన్ అడ్జస్ట్‌మెంట్ చేయగల ఇన్వర్టర్ మోడ్‌తో పాటు సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఎయిర్ కండీషనర్లు డ్యూయల్ రోటరీ కంప్రెషర్లతో పాటు బ్రష్ లేని డిసి మోటార్లు ఉంటాయి. సిక్స్ ఇన్ వన్ ఎయిర్ ఫిల్టర్లు అలాగే నెగటివ్ అయానైజర్ కూడా ఉంటుంది.