కివి పండుతో రోగ నిరోధక శక్తి.

 


శీతాకాలంలో మంచి డైట్‌లో భాగంగా ఏదైనా తీసుకోవాలంటే కివియే అంటున్నారు నిపుణులు. చూడడానికి సపోటాలా కనిపించే ఈ కివి పండు శీతాకాలంలో మనం తినే ఆహారంలో కచ్చితంగా ఉండాల్సింది. కివి ఇప్పుడు మన దేశంలో విరివిగా దొరుకుతుంది. ఈ పండుని న్యూజిలాండ్‌లో ఎక్కువగా పండిస్తారు. అందుకే ఆ దేశ క్రికెటర్లను కివీస్‌ అంటుంటాం అనుకుంట.. ఈ పండు తినడం ద్వారా మనకు అనేక పోషక విలువలు, విటమిన్లు, రోగ నిరోధక శక్తి లభిస్తుంది. సి-విటమిన్‌ మనకు రోగ నిరోధక శక్తి పెంచుతుంది. కివి ఈ పండులో ఇది పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా కివి కాలరీ ఫ్రెండ్లీ ఫ్రూట్‌, అందుకే డైట్‌ ప్లాన్‌ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.