ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ.

 


టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మొదటి టెస్ట్‌కు దూరమయ్యాడు. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 17వ తేదీన అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్ట్ జరగనుంది. తొలిసారి భారత్, ఆస్ట్రేలియా డే/నైట్ టెస్టులో తలబడనున్నాయి. ప్రస్తుతం తాను గాయం నుంచి కోలుకున్నానని.. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో పది రోజులు పడుతుందని డేవిడ్ వార్నర్ తెలిపాడు. సిడ్నీ వేదికగా రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటిదాకా జరిగిన డే/నైట్ టెస్టుల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. అలాంటిది భారత్‌తో జరగబోయే మొదటి డే/నైట్ టెస్టుకు డేవిడ్ వార్నర్ లాంటి అనుభవజ్ఞుడు దూరం కావడం ఆసీస్ జట్టుకు ప్రతికూలాంశమేనని చెప్పాలి. అలాగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో యువ ఓపెనర్‌ విల్‌ పకోస్కీ కూడా కంకషన్‌కు గురికావడంతో ఆస్ట్రేలియాను గాయాల బెడద వేధిస్తోంది