ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.

 


ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పౌరసరఫరాల శాఖ మంత్రి నరేంద్ర తోమర్ తదితరులను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. అవకాశం ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి చెందిన పలు అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు.ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణం కోసం ఇప్పటికే స్థలాన్ని కేటాయించిన నేపథ్యంలో ఆ స్థలాన్ని పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక నదీజలాల అంశంపై.. ఇక సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన పెండింగ్‌ అంశాలపై మళ్లీ కసరత్తు మొదలైంది. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ అనంతరం కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, జరిగిన నిర్ణయాలపై ఇరిగేషన్‌ శాఖ నివేదికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టంలోని సెక్షన్‌–3 ప్రకారం రాష్ట్రం చేసిన ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని, లేనిపక్షంలో అవే అంశాలతో ట్రిబ్యునల్‌కు సిఫార్సు చేయాలన్న విషయమై ఇప్పటికే అపెక్స్‌లో స్పష్టం చేసినా ఇంతవరకు స్పందన లేకపోవడంతో ఈ అంశాన్ని సీఎం కేసీఆర్‌ కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.