కొత్తరకం వైరస్ పై కీలక వివరాలు వెల్లడించిన సిసిఎంబి డాక్టర్ రాకేష్ మిశ్రా.

 


యూకే వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్ దిశగా పయనిస్తున్నాయి. మరోవైపు ఆ దేశానికి విమాన సర్వీసులను అన్ని దేశాలు నిలిపివేశాయి. ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన కొంతమంది వల్ల భారత్‌లో కూడా స్ట్రెయిన్ వైరస్ ప్రభావం మొదలైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ యూకే వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు మళ్లీ లాక్‌డౌన్ దిశగా పయనిస్తున్నాయి. మరోవైపు ఆ దేశానికి విమాన సర్వీసులను అన్ని దేశాలు నిలిపివేశాయి. ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన కొంతమంది వల్ల భారత్‌లో కూడా స్ట్రెయిన్ వైరస్ ప్రభావం మొదలైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా  పలు విషయాలను చర్చించార

యూకే రకం వైరస్ పై సుమారు నలభై శాంపిల్‌లు చెక్ చేశామన్నారు. కొన్ని ఫాల్స్ పాజిటివ్‌గా తేలాయి. మరికొన్నిటిలో17 వేరే వేరే రకాలు, 3 uk రకాలుగా తేలాయి. వేరే రకాలలో ప్రస్తుతం భారతదేశంలో ఉన్నవి కూడా ఉన్నాయి. వందల్లో, వేలల్లో చెక్ చేస్తేనే కొత్త వేరియంట్ గురించి చెప్పగలమని అన్నారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాటిస్తే రెండు,మూడు నెలల్లో వైరస్ మాయమైపోతుందని తెలిపారు. పెద్ద సంఖ్యలో టెస్టులు జరపాలని ప్రభుత్వం కూడా డిసైడ్ అయిందన్నారు. త్వరలో వేల సంఖ్యలో శాంపిల్స్‌ని పరీక్ష చేయబోతున్నామని ప్రకటించారు. కరోనా వైరస్ మ్యుటేషన్ రేట్ నెమ్మదిగానే ఉందన్నారు.

యూకే రకం ప్రమాదకరం కాదు కానీ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే ప్రమాదకరమన్నారు.ఇంగ్లాండ్లో 60 శాతం వ్యాప్తిలో ఉంది ఈ వేరియంటే అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్లలో 1% మరణ శాతం ఉందని, ఈ రకం వల్ల ఒక్కసారిగా హాస్పిటల్కి రోగుల సంఖ్య పెరగవచ్చని అన్నారు. Us లో ఉన్న హాస్పిటల్లు దాదాపు నిండు కుంటున్నాయి, గతంలో ఇటలీ, స్పెయిన్, న్యూ యార్క్ మాదిరిగా పరిస్థితులు తలెత్తే ప్రమాదం పొంచి ఉందన్నారు. Uk రకం వైరస్ విషయంలో భయపడొద్దు కానీ వ్యాప్తి ఎక్కువ కారణంగా జాగ్రత్తపడాలి. నిర్లక్ష్యం చేస్తే మరణ శాతం పెరుగవచ్చని, మన ముందు ఉన్న పెద్ద ప్రమాదం ఇదని వెల్లడించారు.

యూకే shutdown కి కారణం అయ్యింది అంటే అది ఒక మెసేజ్ లాంటిదని, కొన్ని వారాల ముందే ఈ వైరస్ భారతదేశాన్ని చేరుకొని ఉండొచ్చన్నారు. లక్షణాలు లేని వాళ్ల వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇబ్బంది కలగవచ్చు. వ్యాప్తి ఎక్కువగా జరిగితే హెల్త్ కేర్ సిస్టం మీద ప్రభావం ఉంటుందన్నారు. ఇదే జరిగితే అత్యవసరపరిస్థితిని కోరి తెచ్చుకున్న వాళ్ళం అవుతామని హెచ్చరించారు. వ్యాప్తి ఎక్కువ అయితే పెద్ద డ్యామేజ్ జరగొచ్చని, ఒక మీటరు దూరంలో టీ తాగుతూ మాట్లాడిన వాతావరణంతో సంబంధం లేకుండా వ్యాప్తి ఉంటుందని తెలిపారు. వేరే దేశాలతో పోల్చితే మన డాక్టర్ల కృషి ప్రశంసనీయమని, కొత్తరకం కరోనాకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా రకాల పై ఉన్న వాక్సిన్ లు పని చేస్తే ఈ రకానికి కూడా సరిపోవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అవి ఎంతకాలం పనిచేస్తాయి అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు టీవీ9 తో పలు విషయాలను చర్చించారు. యూకే రకం వైరస్ పై సుమారు నలభై శాంపిల్‌లు చెక్ చేశామన్నారు. కొన్ని ఫాల్స్ పాజిటివ్‌గా తేలాయి. మరికొన్నిటిలో17 వేరే వేరే రకాలు, 3 uk రకాలుగా తేలాయి. వేరే రకాలలో ప్రస్తుతం భారతదేశంలో ఉన్నవి కూడా ఉన్నాయి. వందల్లో, వేలల్లో చెక్ చేస్తేనే కొత్త వేరియంట్ గురించి చెప్పగలమని అన్నారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాటిస్తే రెండు,మూడు నెలల్లో వైరస్ మాయమైపోతుందని తెలిపారు. పెద్ద సంఖ్యలో టెస్టులు జరపాలని ప్రభుత్వం కూడా డిసైడ్ అయిందన్నారు. త్వరలో వేల సంఖ్యలో శాంపిల్స్‌ని పరీక్ష చేయబోతున్నామని ప్రకటించారు. కరోనా వైరస్ మ్యుటేషన్ రేట్ నెమ్మదిగానే ఉందన్నారు. యూకే రకం ప్రమాదకరం కాదు కానీ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే ప్రమాదకరమన్నారు.ఇంగ్లాండ్లో 60 శాతం వ్యాప్తిలో ఉంది ఈ వేరియంటే అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్లలో 1% మరణ శాతం ఉందని, ఈ రకం వల్ల ఒక్కసారిగా హాస్పిటల్కి రోగుల సంఖ్య పెరగవచ్చని అన్నారు. Us లో ఉన్న హాస్పిటల్లు దాదాపు నిండు కుంటున్నాయి, గతంలో ఇటలీ, స్పెయిన్, న్యూ యార్క్ మాదిరిగా పరిస్థితులు తలెత్తే ప్రమాదం పొంచి ఉందన్నారు. Uk రకం వైరస్ విషయంలో భయపడొద్దు కానీ వ్యాప్తి ఎక్కువ కారణంగా జాగ్రత్తపడాలి. నిర్లక్ష్యం చేస్తే మరణ శాతం పెరుగవచ్చని, మన ముందు ఉన్న పెద్ద ప్రమాదం ఇదని వెల్లడించారు. యూకే shutdown కి కారణం అయ్యింది అంటే అది ఒక మెసేజ్ లాంటిదని, కొన్ని వారాల ముందే ఈ వైరస్ భారతదేశాన్ని చేరుకొని ఉండొచ్చన్నారు. లక్షణాలు లేని వాళ్ల వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇబ్బంది కలగవచ్చు. వ్యాప్తి ఎక్కువగా జరిగితే హెల్త్ కేర్ సిస్టం మీద ప్రభావం ఉంటుందన్నారు. ఇదే జరిగితే అత్యవసరపరిస్థితిని కోరి తెచ్చుకున్న వాళ్ళం అవుతామని హెచ్చరించారు. వ్యాప్తి ఎక్కువ అయితే పెద్ద డ్యామేజ్ జరగొచ్చని, ఒక మీటరు దూరంలో టీ తాగుతూ మాట్లాడిన వాతావరణంతో సంబంధం లేకుండా వ్యాప్తి ఉంటుందని తెలిపారు. వేరే దేశాలతో పోల్చితే మన డాక్టర్ల కృషి ప్రశంసనీయమని, కొత్తరకం కరోనాకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా రకాల పై ఉన్న వాక్సిన్ లు పని చేస్తే ఈ రకానికి కూడా సరిపోవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అవి ఎంతకాలం పనిచేస్తాయి అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు