వరల్డ్ రెజ్లింగ్‌ సూపర్ స్టార్ కన్నుమూత.

 


కోవిడ్ సమయంలో రెజ్లింగ్ ఆటగాడు క్రీడాకారులు కన్నుమూశాడు. వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సూపర్‌ స్టార్‌ జాన్‌ హుబెర్‌ ఈ ఉదయం మృతి చెందాడు. ఆయన భార్య ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ల్యూక్‌హార్పర్‌ మృతి విషయాన్ని వెల్లడించారు. ఊపరితిత్తుల సమస్యతో హార్పర్‌ మరణించినట్లుగా తెలిపారు. హార్పర్ కరోనా నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. హార్పర్‌ 2019 చివర్లో డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)ను నుంచి ఆల్‌ ఎలైట్‌ రెజ్లింగ్‌లో చేరారు. ఆయన మృతి పట్ల‌ క్రీడాలోకం సంతాపం తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ల్యూక్‌హార్పర్‌కు పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ల్యూక్‌హార్పర్‌‌ మరణం విషాదానికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం అని డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్‌ చేసింది. ర్యాండీ ఓర్టన్‌, షేమస్‌, ట్రిపుల్‌ హెచ్‌ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్లు హార్పర్‌ మృతికి ట్విటర్‌లో సంతాపం వ్యక్తం చేశారు. 1979లో న్యూయార్క్‌లో జన్మించిన హ్యూబర్‌ రెజ్లర్‌గా 1990లో తన కెరీర్ ప్రారంభించారు. 2003లో రోచెస్టర్‌ ప్రోరెజ్లింగ్‌లో బ్రోడై లీ పేరుతో రింగ్‌లోకి దిగారు. 1995లో కెవిన్‌ స్మిత్‌ సినిమా మాల్‌రాట్స్‌లో ఓ పాత్ర పోషించారు. 2012లో డబ్ల్యూడబ్ల్యూఈతో ఒప్పందం చేసుకొని ల్యూక్‌హార్పర్‌గా పేరుమార్చుకొని బరిలోకి దిగారు. 2019 చివరి వరకు కొనసాగారు.